BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 10 February 2026, 09:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణ
10 Feb, 2026 - 09:46 AM
263 వీక్షణలు
చిట్యాలలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 12,118 మంది ఓటర్లకు గాను 12 వార్డులుగా విభజించి 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో -24 మంది ప్రిసైడింగ్ అధికారులు -24 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు -72 మంది ఇతర ఎన్నికల సిబ్బంది ఉన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో మోడల్ (ఆదర్శ) పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లో 13 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా ఒక డీఎస్పీ పర్యవేక్షణలో -ఇద్దరు సీఐలు -8 మంది ఎస్ఐలు -75 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని సీఐ నాగరాజు తెలిపారు. పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా కేంద్రాలకు చేర్చామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. #MunicipalElections #Chityala #PollingDay #ElectionPreparedness #ModelPollingStation #PoliceSecurity #Democracy #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube