BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 21 February 2026, 11:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యూరియా కొరతపై రైతుల ఆందోళన

తెలంగాణ
21 Feb, 2026 - 11:11 AM
420 వీక్షణలు
యూరియా కొరతపై రైతుల ఆందోళన సహకార సంఘం గేటుకు తాళం వేసి నిరసన NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయం ఎదుట రైతులు యూరియా కొరతపై శుక్రవారం ఆందోళన చేపట్టారు. సంఘం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. పిట్టంపల్లి, పేరపల్లి, సుంకనపల్లి తదితర గ్రామాల రైతులు ఈ కేంద్రం ద్వారా యూరియా పొందుతున్నారు. శుక్రవారం రాత్రి కేంద్రానికి 560 బస్తాల యూరియా చేరిందనే సమాచారం రావడంతో ఉదయం నుంచే రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ ‘నో స్టాక్’గా చూపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలకు ఎరువులు వేయలేకపోయామని మహిళా రైతు పేర్కొన్నారు. 560 బస్తాలు వచ్చాయని సమాచారం అందడంతో ఆన్లైన్ బుకింగ్ ప్రయత్నించినా, ఉదయం 9.30లోపే ‘నో స్టాక్’గా చూపించిందని రైతులు తెలిపారు. యూరియా బుకింగ్ కోసం అమలు చేస్తున్న యాప్ విధానం ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపించారు. చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, టోకెన్ విధానం ద్వారా ప్రత్యక్షంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రానికి వచ్చిన 560 బస్తాలను ఎవరికి, ఎంతమేర పంపిణీ చేశారో వివరాలు వెల్లడించాలని కోరారు. పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తోందని రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. #Chityal #Nalgonda #UreaShortage #FarmersProtest #AgricultureNews Follow us on Website Facebook Instagram YouTube