BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 07:41 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
19 Sep, 2026 - 07:41 PM
87 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24, 25వ డివిజన్లలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పర్యటించారు. సింగపూర్, తాళ్లపల్లి, ఆర్‌ఆర్ కాలనీ ప్రాంతాల్లో సింగరేణి జీఎం శ్రీనివాస్‌తో కలిసి ఆయన పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివిజన్‌లలోని ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానికంగా అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు బోడ్డు పద్మ-తిరుపతి, తోట రజిత-శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.