BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 11 January 2026, 03:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వృద్ధులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు

తెలంగాణ
11 Jan, 2026 - 03:26 AM
357 వీక్షణలు

“పోలీసులు మీకోసం” కార్యక్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం

NTODAY NEWS: రామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “పోలీసులు మీకోసం” కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ శాఖ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేష్ నేతృత్వంలో గత నెల నీల్వాయి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి సమన్వయంతో నిర్వహించగా, మంచిర్యాల కంటి వైద్యుల బృందం వైద్య సేవలు అందించింది. ఈ శిబిరంలో సుమారు 200 మంది వృద్ధులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల పరీక్షల్లో 64 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించగా, ప్రత్యేక చొరవతో ఇప్పటివరకు మండలంలోని 40 మందికి మంచిర్యాల పట్టణంలోని పవన్ ఆప్టికల్స్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. మిగిలిన అర్హులైన వృద్ధులకు కూడా త్వరలో కంటి శస్త్రచికిత్సలు కొనసాగించనున్నట్లు తెలిపారు. అలాగే, గత నెలలో నిర్వహించిన “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా మండలంలోని పేద, వృద్ధుల సహాయార్థం సుమారు 100 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు కేవలం లా అండ్ ఆర్డర్ పరిరక్షణకే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా ముందుండి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. Follow us on Website Facebook Instagram YouTube