BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 24 August 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దౌర్జన్యం..

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:04 PM
55 వీక్షణలు

గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దౌర్జన్యం.. లారీ డ్రైవర్‌పై విచక్షణారహిత దాడి

షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన.. రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ సమక్షంలోనే వీరంగం

విశాఖపట్నం జిల్లా గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురుసు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీని ఆపలేదనే కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలోనే ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి జరుగుతున్న సమయంలో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారని లారీ డ్రైవర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై లారీ డ్రైవర్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

లారీ డ్రైవర్‌పై దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.