గానుగాపాడు: జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
గానుగాపాడు: ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. టీడీపీ శ్రేణుల పిలుపు
తిరువూరు సెప్టెంబర్ 1 కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపు
ఎన్టీఆర్ జిల్లా, గానుగాపాడు:
తిరువూరు నియోజకవర్గంలో సెప్టెంబర్ 1న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న “జయహో బీసీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గానుగాపాడు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బీసీల అభ్యున్నతికి స్వర్గీయ ఎన్టీఆర్ రిజర్వేషన్లకు బాటలు వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను తగ్గించారని ఆరోపించిన నాయకులు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
తిరువూరు నియోజకవర్గంలోని 72 గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలోనూ టీడీపీ విజయమే లక్ష్యంగా శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 1న జరిగే “జయహో బీసీ” కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు సింధు శ్రీను, రాజవరపు శ్రీనివాసరావు, రాజ్ అహ్మద్ (హాన్నీ బాయ్), గ్రామ నాయకులు వర్దెపోయిన పెద్ద వీరయ్య, టీడీపీ యువజన నాయకులు కొత్తపల్లి వెంకట్, కోట జమలయ్య, సీసీఎల్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యం, కోట రాజశేఖర్, చింతల వెంకటేశ్వర్లు, కొప్పుల కృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.