BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
09 Aug, 2026 - 05:11 PM
39 వీక్షణలు

గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గం:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన గంగా దేవి బోనాల జాతర ఉత్సవాల్లో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ.. గంగా దేవి అమ్మవారి కృప, ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంతో, ఆనందంగా పండుగలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

బోనాల జాతర సందర్భంగా ఐబీ చౌరస్తా ప్రాంతం భక్తులతో సందడిగా మారింది. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహంతో జాతర ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.