BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

గంజాయి నిర్మూలనకు గ్రామ యువత ప్రతిజ్ఞ.. 'వాల్ ఆఫ్ ప్రామిస్'పై సంతకాలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
54 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పర్వతమ్మగూడెంలో నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొన్నారు. గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం గ్రామస్థులు, మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.

తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన 'వాల్ ఆఫ్ ప్రామిస్' వద్ద గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు, గ్రామస్థులతో కలిసి గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని, గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిజ్ఞ పత్రంపై సంతకాలు చేశారు.

గ్రామ సర్పంచ్, యువత, గ్రామ ప్రజలు కలిసి "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజా భద్రత కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5 వేల వరకు నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మీడియా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.