BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 May 2026, 03:04 pm
Posted by : V శ్రీనివాస్

​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:04 PM
134 వీక్షణలు

​కమిషనరేట్ ఆదేశాలతో ముమ్మర సోదాలు

​జైపూర్ పరిధిలో రంగంలోకి స్పెషల్ వింగ్స్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పరిధిలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మహమ్మారిని రూపుమాపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ వింగ్ ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి జైపూర్ పరిధిలోని కీలక ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పదంగా ఉన్న పాన్ షాపుల్లో అణువణువూ ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.


​సమాజానికి ముప్పుగా మారిన నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును, ముఖ్యంగా యువతను మత్తు రక్కసి బారి నుండి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాబోయే రోజుల్లోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రజలు, యువత కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు