BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 August 2026, 12:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం నుంచి మేడూరు వరకు భక్తుల పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 12:33 PM
91 వీక్షణలు

గంపలగూడెం నుంచి మేడూరు వరకు భక్తుల పాదయాత్ర

108వ పౌర్ణమి పాదయాత్రలో పాల్గొన్న భక్తులు.. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన మార్గం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం రామాలయం నుంచి మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు శుక్రవారం భక్తులు భక్తిశ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. కాషాయ జెండాలు చేతబట్టి జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేస్తూ భక్తులు యాత్రలో పాల్గొన్నారు.

మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న అనంతరం భక్త బృందం సభ్యులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి పర్వదినం సందర్భంగా గంపలగూడెం నుంచి మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది 108వ పౌర్ణమి పాదయాత్ర అని పేర్కొన్నారు.

భక్తి భావాన్ని పెంపొందించడం, హిందువుల్లో ఐక్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భక్తులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.