BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 01 September 2026, 02:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 02:51 PM
77 వీక్షణలు

ఇంటింటికి చేరుతున్న సామాజిక భద్రత సాయం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది.

మండలంలోని గంపలగూడెం, వినగడప, గోసవీడు, నెమలి, ఊటుకూరు, పెనుగొలను తదితర గ్రామాల్లో ఉదయం నుంచే అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేస్తున్నారు.

వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పథకం ద్వారా ఆర్థిక భరోసా లభిస్తోంది. పింఛన్ల పంపిణీతో వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

అయితే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.