BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 01:43 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 01:43 PM
46 వీక్షణలు

గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం.

తక్షణమే స్పందించి వాటర్ ట్యాంకర్‌తో మంటలు ఆర్పించిన గంగా శ్రీనివాసరావు

చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గణపవరం గ్రామ టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ టీడీపీ పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన గంగా శ్రీనివాసరావు తన స్వంత వాటర్ ట్యాంకర్‌ను సంఘటన స్థలానికి తీసుకువచ్చి, అక్కడే ఉండి మంటలను అదుపులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.

ఈ సందర్భంగా స్థానికులు గంగా శ్రీనివాసరావు తక్షణ స్పందనను అభినందించారు. కాగా, డంపింగ్ యార్డులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆకతాయిల చర్యల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.