BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 23 August 2025, 09:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మండలంలో సజావుగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

తెలంగాణ
23 Aug, 2025 - 09:27 AM
388 వీక్షణలు
మండలంలో సజావుగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి --బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బుగ్గ శ్రీశైలం. NTODAY NEWS: బొమ్మలరామారం గణపతి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బుగ్గ శ్రీశైలం సూచించారు మండలంలోని వివిధ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు, యువజన సంఘాల నాయకులు, గణేష్ మండపాల నిర్వహకులతో శనివారం రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బుగ్గ శ్రీశైలం మాట్లాడుతూ ప్రజల భద్రతే మా ప్రాధాన్యతని, వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని తెలిపారు. వినాయక చవితి అనేది ఒక విశిష్టమైన పండుగని,పండుగ జరుపుకునే సమయంలో ఇతరులకు అసౌకర్యం కలగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.అలాగే, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టితో తయారు చేసిన గణపతులను ప్రతిష్టించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మండపాలు నిర్మించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాల విషయంలో భద్రతా చర్యలు తప్పనిసరి పాటించాలని చెప్పారు. పోలీసులు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓకు లేదా 100 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. మండపాల నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే ముందు ఈ లింకు ద్వారా https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని సూచించారు పండుగను సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే అందరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ బైసు రాజేష్ పైలెట్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం,మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పోలగోని వెంకటేష్ గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు వినోద్ కుమార్, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అన్నమైన వెంకటేశ్, యువజన సంఘాల నాయకులు, పోలీస్ సిబ్బంది,గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube