BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 13 June 2026, 07:25 pm
Posted by : V శ్రీనివాస్

గూడెం ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 07:25 PM
179 వీక్షణలు

మంచిర్యాల,జూన్13: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడెం ఆలయ అభివృద్ధికి ప్రజల ఆకాంక్ష మేరకు రూ.70 కోట్ల నిధులు కేటాయించామని, 37 రోజుల్లోనే పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాల కోసం ఘాట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.రైతు సంక్షేమంలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో రూ.74 కోట్ల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో సాగు అభివృద్ధి చెందుతోందని, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు