BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 11 June 2026, 09:30 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 09:30 PM
112 వీక్షణలు

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి,.

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులకు రూ.25,00,814ల డివిడెంట్లు మంజూరయ్యాయి.  బుధవారం గొల్లపూడి పి.ఏ.సీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాల్లో నడవడం హర్షణీయమన్నారు. రైతులకు డివిడెంట్లు ఇవ్వడం ద్వారా సహకార స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పి.ఏ.సీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక లాంటివని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించిన రైతులను ఎమ్మెల్యే అభినందించారు. పి.ఏ.సీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు, (గాంధీ) పి.ఏ.సీఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.