BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరులో అక్రమ ఆయుధాల కలకలం.. నకిలీ ధ్రువపత్రాలతో తుపాకులు, బుల్లెట్లు పొందిన వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 04:18 PM
68 వీక్షణలు

గుంటూరు జిల్లాలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా ఆయుధాలు, బుల్లెట్లు పొందిన వ్యక్తిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తాడికొండకు చెందిన విజయహర్షగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 22 రైఫిల్, ఒక బోర్ షాట్‌గన్, ఒక పిస్టల్, 50 బుల్లెట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో షాప్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న విజయహర్ష, ఫోర్స్ షూటింగ్ కోసం అంటూ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఆయుధాలు పొందినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఆయుధాలు పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.

విజయవాడలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన మిస్‌ఫైర్ ఘటనలో కూడా విజయహర్ష కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. పొన్నెకల్లు గ్రామంలోని ఓ వెంచర్‌లో నిందితుడు తుపాకులతో ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం అందిందని తెలిపారు.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 318(4), 336(3)తో పాటు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25(1) కింద కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.