BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 18 June 2026, 11:18 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

గుంటూరులో వార్డు అడ్మిన్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
18 Jun, 2026 - 11:18 AM
119 వీక్షణలు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 112వ సచివాలయానికి చెందిన వార్డు అడ్మిన్ సెక్రటరీ కె. హిల్డను అధికారులు సస్పెండ్ చేశారు.

ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అదనపు కమిషనర్ G. Sambasiva Rao తెలిపిన వివరాల ప్రకారం, కె. హిల్డకు బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆమె సంబంధిత ఆదేశాలను స్వీకరించలేదు. అలాగే భారత ఎన్నికల సంఘం (ECI) బీఎల్వో లాగిన్‌లో నమోదు చేసుకోకపోవడంతో ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, విధులకు గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అదనపు కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.