BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 May, 2026 - 01:34 PM
107 వీక్షణలు

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ ఆదేశాల మేరకు పలనాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్‌లో టిడిపి ప్రతిష్టాత్మక కార్యక్రమం “మహానాడు పసుపు జాతర–2026”ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్‌, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా, డాక్టర్ కోడెల శివరాం తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమ ప్రారంభంలో నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేడుకలను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడి పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈసారి మహానాడును తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించడం విశేషమైంది.

ఈ సందర్భంగా టౌన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుండి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తదితర అగ్రనాయకులు అందించిన సందేశాలను ఆసక్తిగా వీక్షించారు.

అనంతరం పార్టీ ప్రవేశపెట్టిన పలు కీలక తీర్మానాలను సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా అభినందిస్తూ తమ మద్దతు ప్రకటించారు. మహానాడు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.