BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:38 pm
Posted by : కూనురు మధు

పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Sep, 2026 - 06:38 PM
188 వీక్షణలు

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుడికి వీడ్కోలు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉందన్నారు. వినాయకుడి పూజకు శాస్త్రీయ పరంగానూ ప్రాధాన్యత ఉందని, పండుగలో ఉపయోగించే పత్రి, పూలు, ప్రకృతి ఆధారిత పదార్థాలు పర్యావరణానికి, రైతులకు అనుబంధంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పండుగల వెనుక ఉన్న సాంస్కృతిక, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు “పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి” అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఈవో పోలా గోవర్ధన్  పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.