BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

తెలంగాణ
12 Jun, 2025 - 08:26 AM
283 వీక్షణలు
మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం యావాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడగా ప్రజా పాలనలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తో కలిసి పాఠశాలను పునర్ ప్రారంభించారు.అదే పాఠశాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆట పాట ఒడి అంగన్వాడి బడి అని అన్నారు మన ప్రభుత్వం గొప్ప నిర్ణయంలో భాగంగా పేదవాడు సన్నబియ్యం తినాలి అనే నిర్ణయంతో పాటు అంగన్వాడి విద్యార్థులు కూడా ఎగ్ బిర్యానీ తినాలి అని మంత్రి సీతక్క నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు తండాలు, మారుమూల గ్రామాలలో పిల్లలు ఎంతో చైతన్యవంతంగా చదువుకుంటే రాబోయే కాలంలో ప్రయోజకులు అవుతారని దేశ భవిష్యత్తుకు పునాది అవుతారని అన్నారు ప్రతి గ్రామంలో గుడి తో పాటు బడి ఉండాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది అని అన్నారు పోయిన సంవత్సరంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు అందించడం జరిగిందన్నారు విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాములను అందజేశారు,ఆ తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఇదే సందర్భంలో గత రెండు సంవత్సరాలుగా శాలువాలు వద్దు నోట్ బుక్స్ ముద్దు అనే నినాదంతో బీర్ల ఫౌండేషన్ కి వచ్చిన నోట్ బుక్స్ ని బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు అందజేశారు అనంతరం రామలింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశంను పరామర్శించారు అదే గ్రామంలో నూతనంగా లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు రామలింగంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎర్వా హేమంత్ రెడ్డి తండ్రిగారైన ఎర్వా రంగారెడ్డి జ్ఞాపకార్ధం వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి. శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, మండల విద్యాధికారి రోజా రాణి, ప్రధానోపాధ్యాయులు నిర్మల జ్యోతి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube