ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం
చిట్యాల, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద యంగ్ విగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో సాగిన శోభాయాత్రలో గ్రామస్తులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్రలో గణేష్ నామస్మరణతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
యువత, మహిళలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ బోయ సైదులు, ఎన్టీఆర్, గుండెబోయిన మహేష్, రొయ్య రాకేష్, జన్నపాల రాము, మట్టి పెళ్లి పురుషోత్తం, అనంతుల మల్లేష్, పాకాల నవీన్, ఎం. శ్రీకాంత్, గూనగంటి సందీప్, వై. సంతోష్, బోయ అనిల్, నాగరాజు, జన్నపాల స్వామి, ఎస్‌ఐ నడింపల్లి వినోద్ కుమార్, రాచమల్ల నరేష్, బొమ్మకంటి శివ, జాల వినోద్, వార్డు మెంబర్ జెమిని, జాల సుమన్, శంకర్ బాబు, మర్రి శ్రీకాంత్ తదితర గ్రామ నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు.