BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 27 March 2026, 10:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:28 PM
266 వీక్షణలు

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో, ఆ హెచ్చరికను అమలు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

భారీ ఆయిల్ ట్యాంకర్ అనుమతి తీసుకోకుండా జలసంధి మార్గంలో ప్రయాణిస్తుండగా, దానిపై దాడి చేసి పేల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఘటనకు సంబంధించిన నౌక మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచ ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ సహా ఆరు దేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పేల్చివేసిన నౌక పాకిస్తాన్‌కు చెందినదే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.