BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెనిజులాలో భారీ భూకంపం.. శిథిలాల కింద చిక్కుకున్న మహిళను సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
99 వీక్షణలు

వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వ ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 4,300 మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాజధాని కారకస్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను రెస్క్యూ సిబ్బంది సుదీర్ఘ శ్రమ అనంతరం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలతో బయటపడటంతో అక్కడ ఉన్న స్థానికులు చప్పట్లు కొడుతూ, హర్షధ్వానాలు చేస్తూ రెస్క్యూ బృందాన్ని అభినందించారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఆహారం, తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.