BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

హైదరాబాద్ : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:57 PM
17 వీక్షణలు

హైదరాబాద్ : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట.. కేటీఆర్ పిలుపు

సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

420 హామీల అమలులో వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి: కేటీఆర్

సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేయనున్న బీఆర్‌ఎస్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి పోరుబాటకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రధాన హామీలను నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు.

సెప్టెంబర్ 1న చార్జిషీట్ విడుదల

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్‌లో చార్జిషీట్ విడుదల చేసి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం వరుసగా ఏడు రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 2: ఆరు గ్యారెంటీలపై నిరసనలు

ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన, ప్రజలకు ప్రభుత్వం బాకీ ఉన్న హామీలతో కూడిన బాకీ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 3: రైతు సమస్యలపై పోరాటం

వ్యవసాయ రంగ సమస్యలపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. సాగునీరు, విద్యుత్, యూరియా, పంటల బీమా వంటి అంశాలపై రైతులతో చర్చించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్యపై కూడా నిరసనలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 4: మహిళలు, వికలాంగులతో కార్యక్రమాలు

మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి హామీల అమలు తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. నిరసనలో భాగంగా వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువతతో ర్యాలీలు

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. అదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 6: నగర, గ్రామీణ సమస్యలపై ఆందోళనలు

హైదరాబాద్‌లో తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు, బస్తీ దవాఖానాల అంశాలపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, స్థానిక సమస్యలపై నిరసనలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 7: ప్రజావాణిలో వినతులు

ప్రజావాణి కేంద్రాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందించనున్నారు.

సెప్టెంబర్ 8: జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు

వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు.

సెప్టెంబర్ 10: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు మద్దతు

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టే నిరసన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ సంఘీభావం ప్రకటించాలని కేటీఆర్ సూచించారు.

పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలోని వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజా సమస్యలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.