BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 August 2026, 10:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్: మంత్రి పదవి రేసులో రాములమ్మ..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 10:36 AM
91 వీక్షణలు

హైదరాబాద్: మంత్రి పదవి రేసులో రాములమ్మ.. విజయశాంతి పేరుపై కాంగ్రెస్‌లో చర్చ!

కొండా సురేఖపై నిర్ణయం తర్వాతే స్పష్టత.. బీసీ మహిళా కోటాలో అవకాశం దక్కేనా?

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో మంత్రి పదవుల భర్తీపై కొత్త చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం పార్టీ అధిష్టానం పరిశీలనకు చేరిన నేపథ్యంలో, ఒకవేళ మార్పులు చోటుచేసుకుంటే ఖాళీ అయ్యే స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై కాంగ్రెస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో సీనియర్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీసీ మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా విజయశాంతికి అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో మంత్రి పదవిపై తనకు హామీ లభించిందని విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ స్థాయిలోనూ విజయశాంతి పేరుపై చర్చ జరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో, కొండా సురేఖ స్థానంలో రాములమ్మకు అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొంది.

అయితే కొండా సురేఖపై పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం అనంతరమే మంత్రి పదవి భర్తీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశావహుల జాబితాలో విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.