BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో నేడు బీఆర్ఎస్‌వీ శక్తి ప్రదర్శన.. ఇందిరాపార్క్ వేదికగా విద్యార్థుల గళం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:34 AM
38 వీక్షణలు

హైదరాబాద్‌లో నేడు బీఆర్ఎస్‌వీ శక్తి ప్రదర్శన.. ఇందిరాపార్క్ వేదికగా విద్యార్థుల గళం!

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నేడు విద్యార్థుల ఉద్యమానికి వేదిక కానుంది. విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్‌వీ) ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ధర్నా నిర్వహించనున్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం ఈ ఆందోళన చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ధర్నాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడంతో పాటు విద్యార్థులకు పార్టీ అండగా ఉంటామని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు ఇందిరాపార్క్‌కు తరలిరానుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.