BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

హైదరాబాదును గ్లోబల్ సిని హబ్ గా తీర్చిదిద్దుతాం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Mar, 2026 - 08:25 AM
233 వీక్షణలు

హైదరాబాదును గ్లోబల్ సిని హబ్ గా తీర్చిదిద్దుతాం--ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నట్టుగానే హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల (TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు,పలువురు ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ చైర్మన్ దిల్ రాజు,చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు చిరంజీవి,కమల్ హాసన్, నాగార్జున, మాధురి దీక్షిత్,జయసుధ, ఖుష్బూ ,జెనీలియాతో పాటు దర్శకులు, నిర్మాతలు,నటీనటులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. "ఐటీ, ఫార్మా తరహాలోనే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పోత్సహించాలన్న ఆలోచన చేసిన కారణంగానే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ గారి పేరుతో అవార్డులను పునరుద్ధరించాం. ఆగిపోయిన 10 ఏళ్ల అవార్డులనూ బహూకరించాం. రెండో విడతగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు. గద్దర్ సినిమా అవార్డులను ప్రధానం చేయడం తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించింది.ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలిరావడానికి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, కృష్ణ  తీవ్రమైన కృషి చేశారు.చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఈ నలుగురు విశేషంగా కృషి చేశారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి  తన సొంత స్థలాన్ని ఇళ్లు కట్టుకోవడానికి దానమిచ్చారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా పరిష్కరించడానికి దర్శకుడు దాసరి నారాయణ రావు గారు చేసిన కృషి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది. రామోజీరావు  రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించడంతో హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ శాశ్వతంగా వేళ్లూనుకోవడానికి కారణమైంది.హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని కాకుండా పాన్ ఇండియా - భారతీయ సినిమా ఒక గ్లోబల్‌ హబ్‌గా పరిశ్రమ మొత్తం ఒకే గొడుగు కిందకు వచ్చి గొప్ప సినిమాలు అందించాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సినిమాలను సైతం హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే నిర్మించేలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం.ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్  Netflix ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టే. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్ చేస్తాం.లక్షల కోట్ల మందిని తన గళంతో ప్రజలను ప్రభావితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి, అందుకని గద్దర్ గారి పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించాం. సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమాలు అత్యంత ప్రభావవంతమైన ఆయుధం సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమా ఒక సాధనంగా ఉపయోగపడాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాల ద్వారా సందేశం అందించాలి.హైదరాబాద్, తెలంగాణ అత్యంత భద్రత కలిగిన రాష్ట్రం. టాలెంట్‌కు అవకాశాలున్నాయి. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది. హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ నిర్మించండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం హామీనిస్తుంది...” అని చెప్పారు. ప్రత్యేక విభాగంలో కొణిదెల చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ పురస్కారం), సింగీతం శ్రీనివాస రావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు), చలసాని అశ్వినీదత్ (నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు), సుద్దాల అశోక్ తేజ (డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు), జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు అవార్డు), ఆర్ నారాయణ మూర్తి (కాంతారావు అవార్డు), అక్కినేని రమేష్ ప్రసాద్ (రఘుపతి వెంకయ్య అవార్డు), కమల్ హాసన్ (పైడి జైరాజ్ అవార్డు), ఉత్తమ నటుడు నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)లతో పాటు వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.