BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 30 April 2026, 10:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:19 PM
168 వీక్షణలు

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీ కొట్టి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హనుమాన్ జంక్షన్‌కు చెందిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా కారుతో వెంబడించి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రాంతి కిరణ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ఢీకొట్టుడుతో తీవ్రంగా గాయపడిన క్రాంతి కిరణ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.