BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 November 2025, 09:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చేతిరాతను బట్టి మనోభావాలను అర్థం చేసుకోవచ్చు

తెలంగాణ
23 Nov, 2025 - 09:13 AM
401 వీక్షణలు
చేతిరాతను బట్టి మనోభావాలను అర్థం చేసుకోవచ్చు :-HCF చర్చాగోష్టిలో ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య NTODAY NEWS: హైదరాబాద్ మన మనస్తత్వాన్ని, మన చేతిరాతను బట్టి చెప్పవచ్చని CESS రిటైర్డ్ ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో జరిగిన చర్చాగోష్టిలో ప్రొఫెసర్ రామచంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై గ్రాఫాలజీ మరియు గ్రాఫోతెరపి అంశాన్ని పరిచయం చేస్తూ మాట్లాడారు. చేతిరాతకు సైకాలజీకి సంబంధం ఉందని, చేతిరాతను బట్టి మన మనోభావాలను, మానసిక స్థితిని తెలుసుకోవచ్చని తద్వారా చేతిరాతలో మార్పులు చేసుకొనుట ద్వారా కొన్ని మానసిక విషయాలను అధిగమించవచ్చునని, ఇది ఒక శాస్త్రం అని అన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులకు పూర్తిస్థాయి డిజిటలైజేషన్ చేయటం ద్వారా చేతిరాతకు పని లేకుండా పోతున్నదని అన్నారు. స్వీడన్ లో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయి డిజిటలైజేషన్ చేశారని ఫలితంగా అనేక దుష్పరిణామాలు ఏర్పడి సమీక్షించుకొని తిరిగి పాక్షికంగా అంత మేరకు పాత పద్ధతికి దాల్చిన స్థితి వచ్చిందని అన్నారు. చర్చాగోష్టికి హాజరైన విద్యార్థులు, యువతులు సీనియర్ సిటిజెన్ల చేతి రాతలను పరిశీలించి వారి అలవాట్లను భావాలను తెలియజేశారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న వారంతా ప్రొఫెసర్ రామచంద్రయ్య విశ్లేషణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్చాగోష్టికి ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న రమేష్ గారు అధ్యక్షత వహించారు. పర్యావరణ వేత్త డాక్టర్ జయసూర్య, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్, సామాజికవేత్త రాజీవ్ కుమార్, రిటైర్డ్ ఎస్సీ ఇంజనీర్ భవాని శంకర్, హెచ్ సి ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.వీరయ్య, నాయకులు పి శ్రీనివాసరావు, సుకుమార్, సంగీత,లలిత, శంకర్, రఘు, మోహన్ నాయుడు ఇతరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube