BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 07 August 2026, 11:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 11:23 AM
85 వీక్షణలు

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో సాయి బాబా యువజన కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికి దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపించిన మహనీయుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి ఆధునిక పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.

స్వామినాథన్ కృషి కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, కోట్లాది మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార భద్రత కోసం ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.

వ్యవసాయ రంగానికి, దేశ ఆహార భద్రతకు స్వామినాథన్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించిందని, ఆయనకు మరణానంతరం 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించి గౌరవించిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల సంఘం ఉపాధ్యక్షుడు వడ్డెరపు వెంకటేశ్వర్లు, మహిళా కమిటీ సభ్యులు, యువజన కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.