BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 09:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 09:16 PM
25 వీక్షణలు

ఖమ్మం: ఉద్యోగ సంబంధిత పని చేసేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన హాస్టల్ వార్డెన్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఐటీడీఏ ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తున్న వ్యక్తి జీతానికి సంబంధించిన పనిని చేయడానికి వార్డెన్ భూక్యా వాల్‌సింహ రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టి, వార్డెన్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతి, లంచాలపై ఫిర్యాదులు అందుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై స్పందిస్తూ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.