BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 09:11 pm
Posted by : RAMU JAJU

ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే బైక్ సీజ్..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
22 Aug, 2026 - 09:11 PM
66 వీక్షణలు
ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే బైక్ సీజ్..

నందిపేట: ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట, డొంకేశ్వర్ మండలాల పరిధిలో ఆగస్టు 22 నుండి ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, కేవలం వాహనం నడిపేవారే కాకుండా వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ, కోమాలోకి వెళ్తూ వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఎస్సై, వాహనదారులంతా పోలీసుల జరిమానాలకు భయపడి కాకుండా, తమ ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల సంతోషాల కోసం బాధ్యతగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.