BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 06:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:13 PM
148 వీక్షణలు

ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం!

అమరావతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇంటింటి ప్రచార యజ్ఞం చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించారు.

అంతేకాకుండా, ఈ-సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలని సూచించిన సీఎం, "నేను కూడా సైకిల్ ఎక్కి ప్రజల మధ్యకు వస్తా" అని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు సంకేతాలు ఇచ్చారు.