చిన్నవడ్డేపల్లి, ఉరుసుగుట్ట నిమజ్జన కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: చిన్నవడ్డేపల్లి, ఉరుసుగుట్ట చెరువు నిమజ్జన కేంద్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్లతో కలిసి కమిషనర్ టి. వెంకన్న సందర్శించారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత కోసం చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిమజ్జన కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలను పరిశీలించిన కమిషనర్.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
నిమజ్జన కేంద్రాల్లో పారిశుద్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, వర్షాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సురక్షితంగా సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.