BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 08 March 2026, 06:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం

తెలంగాణ
08 Mar, 2026 - 06:03 AM
230 వీక్షణలు
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సంఘటిత పోరాటాలకు సంకేతం – ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి NTODAY NEWS: నల్గొండ నల్గొండ, మార్చి 08: అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యకస, యూటీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు తుమ్మల పద్మ, కుంచెం కావ్య, శ్రీవాణి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు లేదా బహుమతులతో ముగిసే రోజు కాదని తెలిపారు. కార్మిక మహిళల చరిత్రలో రక్తం, చెమట, ధైర్యం, తెగువతో చెక్కబడిన పోరాట దినమని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా, సమాన హక్కులు మరియు రాజకీయ హక్కుల సాధన కోసం వీధుల్లోకి వచ్చి పోరాడిన మహిళల త్యాగాలను స్మరించుకునే రోజు ఇదని వివరించారు. ప్రస్తుతం దేశంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా ఉద్యమాలు మరింత బలంగా రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ పేద మహిళల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. దీనివల్ల మహిళల జీవనాధారంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక, రైతు మరియు ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అదే స్ఫూర్తితో మహిళా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ పాల్గొన్నారు. అలాగే సంఘాల నాయకులు జిట్టా సరోజ, కొండ అనురాధ, గుండాల నరేష్, కిరణ్, అవుట రవీందర్, భూలక్ష్మి, చెనబోయిన నాగమణి, సుల్తానా, గోలి వెంకటమ్మ, బహిరోజు ఇందిరా, మంజుల, పుష్ప, స్పందన, కీర్తన, షాలిని, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. #InternationalWomensDay #AIDWA #WomenRights #WorkersMovement #NalgondaNews #TelanganaNews #WomenEmpowerment Follow us on Website Facebook Instagram YouTube