BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:24 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్సార్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Sep, 2026 - 06:24 PM
80 వీక్షణలు

ప్రకాశం జిల్లా, సంతమాగులూరు:

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో సెప్టెంబర్ 21న నిర్వహించనున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ సూచనల మేరకు అద్దంకి నియోజకవర్గ పార్టీ నాయకులు కేసరి చెన్నారెడ్డి, మారం రెడ్డి కొండారెడ్డి, చాగంటి రాజశేఖర్ రెడ్డి కనిగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా వెల్లలచెరువు గ్రామంలో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కార్యక్రమ ఏర్పాట్లు, పాల్గొనే వారి వివరాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.