BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 01:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జీవో నెం. 396 రద్దు చేయాలని తిరువూరులో నిరవధిక నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:24 PM
76 వీక్షణలు

జీవో నెం. 396 రద్దు చేయాలని తిరువూరులో నిరవధిక నిరసన

తిరువూరు, జూలై 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దస్తావేజు లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు సోమవారం నుంచి నిరవధిక నిరసన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్ల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి జూలై 31 వరకు తిరువూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు ప్రజల దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించే జీవో నెం. 396 తమ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకుని తమ ఉపాధిని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం సబ్-రిజిస్ట్రార్ శ్యాముండేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. అలాగే తిరువూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ప్రజలందరూ తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మనాభుని నాగేశ్వరరావు, వూటుకూరు రవికుమార్, కొండపల్లి మురళి, గౌర్రాజు ప్రభాకర్‌రావు, నరసింహారెడ్డి, మడుపు లవకుమార్, మడుపు యశ్వంత్‌కుమార్, జే.ఎస్. కుమార్, ముజిబుర్ రహ్మాన్, మోదుగు ప్రసన్నకుమార్, పానేం శ్రీనివాసరావు, చీపి రాంబాబు, రావూరి నాగమయ్య, మేరుగు నాగభూషణం, కే. దుర్గారావు, ఎన్. సౌజన్య, నల్లగట్ల సతీష్, షేక్ మౌలాలి, గోళ్ల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.