BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 06:13 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 06:13 PM
142 వీక్షణలు

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

జిల్లాలోని టమోటా మార్కెట్ యార్డుల్లో ఎలాంటి అక్రమాలకు కూడా తావు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి టి.త్యాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీల సెక్రటరీలతో జాయింట్ కలెక్టర్ మరియు మదనపల్లి సబ్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులలో పారదర్శకత, క్రమబద్ధతను మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిపారు.

ముఖ్యంగా, జిల్లాలోని అన్ని మార్కెట్లలో 15 కిలోల క్రేట్లను 100 శాతం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా మదనపల్లి మరియు ములకలచెరువు మార్కెట్ యార్డుల్లో హమాలీలు, లారీ సంఘాలు రైతుల నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారని తెలిపారు. అలాగే మార్కెట్ యార్డులలో సీసీ కెమెరాలు, డిజిటల్ బోర్డులు తప్పనిసరిగా పనిచేసేలా ఏర్పాటు చేయాలని, రైతులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారన్నారు.

రైతుల సౌకర్యార్థం తాగునీరు, ఫిర్యాదు పెట్టెలు అందుబాటులో ఉంచాలని, రైతులు తమ సమస్యలను నేరుగా తెలియజేయగల విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు తమ ఫిర్యాదుల కోసం సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శులు మరియు జిల్లా మార్కెటింగ్ అధికారిని ఈ క్రింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు:

మదనపల్లి – 91823 61494

గుర్రంకొండ – 91823 61495

ములకలచెరువు – 91823 61501

కలికిరి – 94410 73781

అంగళ్లు – 91823 61518

పుంగనూరు – 91823 61169

సోమల – 91823 61507

జిల్లా మార్కెటింగ్ అధికారి – 91823 61536

అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా మదనపల్లి, అంగళ్లు మరియు కలకడ మార్కెట్ యార్డుల కోసం భూముల కేటాయింపుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరితగతిన సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని మార్కెట్ వ్యవస్థను పారదర్శకంగా, రైతు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

డిఐపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా