BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఆరు నెలలు గడిచినా పాత జిల్లా పేరే

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 05:43 AM
31 వీక్షణలు

ఆరు నెలలు గడిచినా పాత జిల్లా పేరే — అధికారుల నిర్లక్ష్యంపై కార్డ్స్ ఆగ్రహం

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోకి మారి ఆరు నెలలు పూర్తవుతున్నా కాటిపేరి విలేజ్ క్లినిక్‌పై ఉన్న బోర్డులో మాత్రం జిల్లా పేరు మారకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ (కార్డ్స్) వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ విమర్శించారు.కాటిపేరి విలేజ్ క్లినిక్‌తో పాటు స్వర్ణగ్రామం ప్రాంతంలో ఉన్న బోర్డులను పరిశీలించిన ఆయన, ఇప్పటికీ పాత జిల్లా పేరు కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు కనీసం తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు,సంస్థల బోర్డులలో మార్పులు జరిగాయా లేదా అనే విషయాన్ని కూడా పర్యవేక్షించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచిన్న విషయాల్లోనే ఇంతటి నిర్లక్ష్యం కనిపిస్తే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు ఎంతవరకు స్పందిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోందని హరిప్రసాద్ పేర్కొన్నారు.అధికారులు తమ విధుల్లో జవాబుదారీతనం పాటించడంతో పాటు,ప్రజాధనంతో పొందుతున్న జీతభత్యాలకు తగిన విధంగా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.సంబంధిత అధికారులపై మాత్రమే కాకుండా,పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు కూడా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయంపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ తెలిపారు.