BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 May 2026, 01:08 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 01:08 PM
130 వీక్షణలు

అన్నమయ్య జిల్లా: మదనపల్లి  తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ వి.జె. రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. వెండితెరపై పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి అద్భుత విజయాలు సాధించిన ఆయన, రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి సామాన్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ దార్శనికత, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు, సమాజ శ్రేయస్సుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఎంటిఓ) కె. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ ఎం. చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది మరియు హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అంజలి ఘటించారు.