BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 16 June 2026, 06:54 pm
Posted by : V శ్రీనివాస్

​జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 06:54 PM
160 వీక్షణలు

​ఈ నెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదిగా ప్రారంభం.. జిల్లా లక్ష్యం 41 లక్షల మొక్కలు

​జిల్లా వ్యాప్తంగా చేపట్టబోయే వనమహోత్సవం కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యలతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మరియు మున్సిపల్ కమిషనర్లతో వన మహోత్సవం నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదిగా ఇది ప్రారంభం కానుందని, అదే రోజున జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. నర్సరీలలోని మొక్కల వివరాలు, ప్లాంటేషన్ సైట్ల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని, మొక్కలు నాటిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీ నివేదికలను నవీకరించాలని, వీటికి అటవీ అధికారులు సాంకేతిక సహాయం అందిస్తారని స్పష్టం చేశారు.

​జిల్లాలో గనుల విస్తృతి కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున, ఖాళీ ప్రదేశాలన్నింటిలో మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలను అదుపులోకి తీసుకురావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. రహదారులకు ఇరువైపులా పెద్ద వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటాలని, పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల తగాదాలు ఉన్న వివాదాస్పద ప్రాంతాలలో వెదురు మొక్కలను నాటాలని, ప్రజలు ఎక్కువగా సంచరించే బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ప్రతి ఒక్క మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇదే సమయంలో, మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని మరియు వాటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా ఆదేశించారు