BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 01 September 2026, 02:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జింకలపాలెం పాఠశాలలో పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 02:51 PM
30 వీక్షణలు

విద్యార్థులకు గ్లాసుల పంపిణీ చేసిన శిరిడి సాయిబాబా సేవా కమిటీ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం:

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ శివారు జింకలపాలెంలోని ఉర్దూ, తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో శివతాండవం రచయిత పుట్టపర్తి నారాయణాచార్యుల 36వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారని తెలిపారు. చిన్న వయసులోనే సాహిత్యంపై పట్టు సాధించిన ఆయన 12 ఏళ్ల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రచించారని, ఆ కావ్యాన్ని విద్వాన్‌ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారని వివరించారు.

పుట్టపర్తి వారి ప్రసిద్ధ రచనల్లో ‘షాజీ’ కావ్యం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని, ‘శివతాండవం’ ఆరు భాగాల మహాకావ్యంగా తెలుగు సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ‘శివతాండవం’ గానం చేసిన సమయంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఆయన ప్రతిభకు ముగ్ధుడై అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు.

పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాషా కోవిదులని, 14 భాషలు నేర్చుకున్నారని తెలిపారు. తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడ, ఆంగ్లం తదితర భాషల్లో రచనలు చేశారని, దాదాపు 140కి పైగా గ్రంథాలను రచించారని వివరించారు. ఇందులో 50 కావ్య గ్రంథాలు, అనువాద గ్రంథాలు, వందలాది వ్యాసాలు, వేలాది సంగీత కీర్తనలు ఉన్నాయని తెలిపారు.

హృషికేష్‌లో ఆయన ప్రతిభకు ముగ్ధుడైన శివానంద సరస్వతి ‘సరస్వతీపుత్ర’ బిరుదుతో సత్కరించారని, 1974లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందని చెప్పారు. 1990 సెప్టెంబర్ 1న ఆయన గుండెపోటుతో కన్నుమూశారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు విద్యార్థులకు రాగిజావ, మంచినీరు తాగేందుకు గ్లాసులు పంపిణీ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షహనాజ్ బేగం, ఉపాధ్యాయులు నాగారపు బద్రినాథ్, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.