BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 08:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 08:30 PM
163 వీక్షణలు

జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్   

పుంగనూరు, 

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడం లేదా ఆయన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం ఎవరి వల్లా కాదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాష్ట్ర నాయకుడు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా యువత, ప్రజల్లో విశేష ఆదరణ పొందిన నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడి సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, దేశంలో తిరగడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొందరు రాజకీయ నాయకులు భయపడుతున్నారని, అందుకే జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కూడా జనసేనకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కొందరు నాయకులు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయని చైతన్య రాయల్ హెచ్చరించారు.