BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 18 June 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జోగి రమేష్‌పై విమర్శలకు ముందు టిడిపి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి – వైఎస్ఆర్‌సీపీ నేత చాట్ల రాబర్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:08 PM
102 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల పరిషత్ ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే స్థితికి తీసుకెళ్లిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక అందిస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల విషయంలో ఒక కిలో తారం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు 100 కిలోలకు 10 కిలోల తారం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని తెలిపారు.

అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో మొదట అమలు చేస్తామన్న ఆడబిడ్డ నిధి విషయంలో కూడా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇలాంటి అంశాలపై ప్రశ్నించిన జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ముందుగా టిడిపి నాయకులు తమ వైఫల్యాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.