BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 21 August 2026, 03:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌కు మద్దతు.....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 03:57 PM
74 వీక్షణలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌కు మద్దతు.. ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏపీవైజేఎఫ్ కృతజ్ఞతలు

గుంటూరు: జర్నలిస్టుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ప్రస్తావించి, అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీవైజేఎఫ్) గుంటూరు జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, వారి కుటుంబాల భవిష్యత్‌కు సంబంధించిన సమస్యలపై ఏపీవైజేఎఫ్ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకుని, అసెంబ్లీలో జర్నలిస్టుల తరఫున గళం వినిపించడం అభినందనీయమని జిల్లా కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను శాసనసభలో ప్రస్తావించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భవిష్యత్తులోనూ సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఏపీవైజేఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పి. సాయికుమార్, ప్రధాన కార్యదర్శి పి. హరీష్, కార్యనిర్వాహక కార్యదర్శి స్వచ్ఛంద ప్రసాద్, శ్యామ్యూల్, షేక్ కాలేషావలి, విజయ్ ధనరాజ్, యర్ధనపూడి ఆరుద్ర, తిమ్మిరి శంకర్, పి. కోటేశ్వరరావు, ఓ. నాగ తదితరులు పాల్గొన్నారు.