BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 18 May 2026, 10:03 am
Posted by : BATHULA VENKATESH

మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు..

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
18 May, 2026 - 10:03 AM
131 వీక్షణలు

Ntoday news : కాకినాడ జిల్లా తుని మండలం జనసేన అధ్యక్షుడు, పిఎసిఎస్ మెంబర్, మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.. ఈ మేరకు వెంకటరమణ మృతిదేహాన్ని కాకినాడ నుంచి బంధువులు తమ స్వగ్రామం కొలిమేరుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు.. ఇటీవల కాలంలో మధుమేహం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకటరమణ వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా అక్కడ వైద్యుల సూచన మేరకు వెంకటరమణ పాదాన్ని తొలగించారు.. అప్పటికే కిడ్నీ వైఫల్యం ఉండడంతో తీవ్ర ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మొదటిగా తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సూచన మేరకు ఇటీవల కాకినాడ జిజిహెచ్ కు తరలించారు.. అయితే వెంకటరమణ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండడంతో అప్పటినుంచి వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఆదివారం సాయంత్రం పూర్తిస్థాయిలో ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.