BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 02 July 2026, 05:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో ఘనంగా వీబీజీ రామ్‌జీ పనుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 05:03 PM
148 వీక్షణలు

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రామ్‌జీ) కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కావడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చాట్రాయి మండలంలో కూడా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు, ఏపీఎం లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వీబీజీ రామ్‌జీ పనులకు ప్రారంభోత్సవం చేశారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రజల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల్లో చెరువుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, పచ్చదనం పెంపు, తాగునీటి వసతుల మెరుగుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా స్థానిక కూలీలకు నిరంతర ఉపాధి లభించడంతో పాటు గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేశారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభం కావడం గ్రామీణాభివృద్ధికి మరో కీలక అడుగుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.