BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 August 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:43 PM
65 వీక్షణలు

కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం.. సీఎం చంద్రబాబు జోక్యంతో సమస్య పరిష్కారం

కాకినాడ, ఆగస్టు 23:

కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యంగా పరిష్కారమైంది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది.

ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీంతో ఆయన వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.

విద్యార్థినుల భద్రతకు పూర్తి భరోసా కల్పించిన అధికారులు, వారికి అవసరమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ యాజమాన్యంతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు.

ప్రభుత్వ యంత్రాంగం సత్వర స్పందనపై ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల చొరవతో సమస్య పెద్దదిగా మారకముందే సామరస్యంగా ముగిసింది.