BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 18 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కామాంధుల వేధింపుల ఆరోపణలతో షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య.. పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:45 PM
135 వీక్షణలు

హీరోయిన్ కావాలన్న కలతో నగరానికి వచ్చిన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఆమె కెరీర్ ప్రారంభ దశలోనే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందినట్టు సమాచారం.

అయితే కొంతమంది యువకులు ఆమె వ్యక్తిగత వీడియోలు రహస్యంగా చిత్రీకరించి, వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తమ కోరికలు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారని, తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ వేధింపులను భరించలేక అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఘటనకు ముందు పోలీసులను ఆశ్రయించినా సరైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, దాదాపు 10 రోజులు గడిచినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తమవుతోంది. నిందితుల్లో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.