BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 11 May 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 May, 2026 - 06:46 AM
283 వీక్షణలు

కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత అమరుడు కామ్రేడ్ పటాన్ సత్తార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సత్తార్, వామపక్ష భావజాలంతో కార్మిక రంగంలో అనేక పోరాటాలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. రాయలసీమలో పార్టీ అభివృద్ధికి సత్తార్ ఎనలేని కృషి చేశారని తెలిపారు.

డబుల్ ఇంజన్ పాలన కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో నిర్బంధించిన నోయిడా కార్మికులందరినీ భేషరతుగా విడుదల చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మతోన్మాద ఫాసిస్ట్ శక్తులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యులర్ భావజాలంతో ప్రజలతో మమేకమైన సత్తార్ లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. అరుణ, ఏలూరు జిల్లా ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, లిబరేషన్ సభ్యులు చాట్ల బాబురావు, భవాని తదితరులు పాల్గొన్నారు.